హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు: కారులో ఒంటరిగా ప్రయాణించడంపై జరిమానా లేదు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నవంబర్ 26న ఎక్స్(X) పోస్టులో నగరంలో కారులో ఒంటరిగా ప్రయాణించినందుకు జరిమానా ఉండదని స్పష్టం చేశారు; ప్రజలకు అధికారిక ఖాతాలను మాత్రమే అనుసరించాలని చెప్పారు.

ఫైల్ ఫొటో Oleg Yunakov
ఫైల్ ఫొటో Oleg Yunakov CC BY-SA 4.0

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నవంబర్ 26న తమ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఫేక్ న్యూస్ అలర్ట్ విడుదల చేసి, నగరంలో "కారులో ఒంటరిగా ప్రయాణించడంపై" ఏమైనా కొత్త జరిమానా లేదా "కాన్జస్టన్‌ ఫైన్" వంటివి అమలులో లేవని చెప్పారు. X post by @hydtp

పోస్టులు, రీల్స్ లేదా ఇతర సోషల్ మీడియా ప్రచారాల ద్వారా వస్తున్న విషయాలను నమ్మొద్దని, ట్రాఫిక్‌కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం వారి అధికారిక సోషల్‌ మీడియాలోని ఖాతాలను చూసి తనిఖీ చేయాలని, ఎలాంటి సందేహాలైనా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626కి సంప్రదించాలని పోలీసులు సూచించారు.

More in తెలంగాణ