సౌదీలోని జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై దాడిలో నేపాలీ కార్మికుడు మృతి

జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై నవంబరు 26న జరిగిన దాడిలో ఒక నేపాలీ కార్మికుడు మరణించగా పలువురు గాయపడ్డారని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది.

సౌదీ అరేబియాలోని జజాన్ నగరం. ఫైల్ చిత్రం. AliAlghamdi12 / Wikimedia Commons
సౌదీ అరేబియాలోని జజాన్ నగరం. ఫైల్ చిత్రం. AliAlghamdi12 / Wikimedia Commons CC BY-SA 4.0

సౌదీ అరేబియా నైరుతి ప్రాంతంలోని జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై నవంబరు 26న దాడి జరిగింది. ఒక నేపాలీ కార్మికుడు మరణించారని, పలువురు గాయపడ్డారని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.

దాడి తర్వాత చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చారని, కేంద్రంలోని కొన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారని మంత్రిత్వ శాఖ ప్రకటనను ఉటంకిస్తూ ఖతార్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

దాడి హౌతీలదని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాల ప్రతినిధి చెప్పినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది.

మూలాలు

More in ప్రపంచం