డిసెంబరు 6 నుంచి తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14 వరకు జరుగుతాయని టీటీడీ ప్రకటించింది. చివరి రోజు పంచమితీర్థం నిర్వహిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ గోపురం. ఫైల్ చిత్రం. Bhaskaranaidu / Wikimedia Commons
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ గోపురం. ఫైల్ చిత్రం. Bhaskaranaidu / Wikimedia Commons CC BY 2.5

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14 వరకు జరగనున్నాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు తెలిపాయి.

డిసెంబరు 5న అంకురార్పణ, 6న ధ్వజారోహణం నిర్వహిస్తారు. డిసెంబరు 11న స్వర్ణరథం, గరుడ వాహన సేవలు, 13న రథోత్సవం ఉంటాయి. డిసెంబరు 14న పంచమితీర్థంతో ప్రధాన ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ ప్రకటించింది.

పంచమితీర్థం కోసం తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారె తీసుకొచ్చే ఊరేగింపు మార్గాన్ని అధికారులు నవంబరు 25న పరీక్షించారు. ఆ రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని టీటీడీ సూచించింది.

మూలాలు

More in ఆంధ్రప్రదేశ్