నవంబరు 29న తిరుమలలో కార్తీక వనభోజనం
తిరుమలలో గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో ఆదివారం కార్తీక వనభోజనం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
Vimalkalyan / Wikimedia Commons
తిరుమలలో నవంబరు 29న కార్తీక వనభోజనం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రకటించాయి. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఉదయం 8.30 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు వనభోజనం నిర్వహిస్తారు.
కార్యక్రమం సందర్భంగా ఆదివారం శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
